కరుణానిధి రాతియుగంనాటి మనిషి: జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాతియుగంనాటి మనిషిగా అభివర్ణించారు. జయలలిత నెల రోజులుగా కొడనాడు పర్వత ప్రాంతాలలో విడిది చేస్తున్నారు. ఆమె అక్కడి నుంచే పాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీనిని కరుణానిధి ప్రశ్నించేసరికి జయలలిత మండిపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్న రోజులలో రాజధానికి దూరంగా ఉండడం పెద్ద విషయం కాదని, కొడనాడులో ఉన్నా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. ఆధునిక సౌకర్యాలు అందివచ్చిన రోజులలో కరుణానిధి రాతియుగం (అప్పటికి ఎలాంటి వసతులూ లేవు) నాటి మనిషిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.